BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

కరీంనగర్ IDOC ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

Select Suryaa Now
కరీంనగర్ IDOC ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

సూర్య కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు నూతన పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకున్న ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఉద్యోగులు ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాకు ఆధునిక పరిపాలనా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా నిర్మించిన IDOC ప్రారంభోత్సవం జిల్లా పరిపాలనా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందించేందుకు ఈ సముదాయం దోహదపడుతుందని తెలిపారు.
అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్ గారిని ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యోగ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. IDOC ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ్యం లక్ష్మణరావు, అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్విందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి, శారద, సరిత, కరుణ, సూర్య, వీణ, రామచంద్ర రెడ్డి, బాస పవన్, పోల్ కిషన్, సుమంత్ రావు, వాస్తవిక గౌడ్, శ్రీమాన్, శంశోద్దిన్, లవకుమార్, కర్ణాకర్, అజ్గర్ అలీ, నారాయణ, రాజమల్లు తదితర ఉద్యోగ జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.