ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి
ఎస్వియూ ఫార్మసీ విభాగంలో మేనేజ్మెంట్ కోట సీట్లను పెంచాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న 5 మేనేజ్‌మెంట్ సీట్లను 10కి పెంచాలని కోరుతూ ఎస్వియూ టిఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర గౌడ్ బుధవారం రెక్టర్ ఆచార్య చండ్రాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024కు ముందు ఫార్మసీ విభాగంలో మొత్తం 40 సీట్లు ఉండగా అందులో 5 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉన్నాయని, ఆ తర్వాత మొత్తం సీట్ల సంఖ్యను పెంచినప్పటికీ మేనేజ్‌మెంట్ సీట్లు మాత్రం పెరగలేదన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు మేనేజ్‌మెంట్ సీట్లను 10కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ తరుణ్, నాయకులు లారెన్స్, దాదా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.