గాంధీ జయంతి సందర్భంగా చిత్రలేఖనం, వ్యాసరచన - పోటీలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత..
గాంధీ జయంతి సందర్భంగా చిత్రలేఖనం, వ్యాసరచన - పోటీలు
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత..
కడప మేజర్ న్యూస్
గాంధీ జయంతిని పురస్కరించుకుని కడప కోటిరెడ్డి మహిళా కళాశాలలో గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, అభివృద్ధి, పర్యాటక పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు ఎంతో గొప్పవని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని, స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర సాధనకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై విద్యార్థినులు పోటీల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. గురువురెడ్డి మాట్లాడుతూ విద్యార్థినుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి చేరువ చేయడంతో పాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగం అధ్యాపకులు స్వరూప, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు..