పెనమలూరులో ఆపదలో అండగా బోడే ప్రసాద్
పెనమలూరులో ఆపదలో అండగా బోడే ప్రసాద్
పెనమలూరు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : పెనమలూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, ఆపద సమయంలో అండగా నిలవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.8.23 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచి, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులకు చేరవేయడంలో పార్టీ నాయకులు చొరవ చూపారు.