BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన

 

* నాణ్యమైన రోడ్లు, మెరుగైన మౌలిక వసతులే కూటమి ప్రభుత్వ సంకల్పం
* ఆర్ అండ్ బి  అధికారులతో కలిసి అధ్వానంగా ఉన్న రోడ్ల పరిశీలన
* రోడ్డు పనుల కోసం దాదాపు ₹4.1 కోట్లు మంజూరు: నేటి నుంచే పనులు ప్రారంభం
* ప్రమాద బాధితుల వైద్య ఖర్చులకు ₹16 లక్షల ఎల్ ఓ సి మంజూరు చేసిన ప్రభుత్వం

పెందుర్తి, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : 
నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. బుధవారం పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అసకపల్లి నుండి పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు గుంతలతో అధ్వానంగా మారిన రోడ్డును రహదారులు-భవనాల శాఖ జిల్లా అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు పూర్తిగా శిథిలమై ఉండటం పట్ల ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పైడివాడ అగ్రహారం నుండి పెదముసిడివాడ వరకు రోడ్డు నిర్మాణానికి ₹2.5 కోట్లు, లంకెలపాలెం జంక్షన్ నుండి పరవాడ వరకు ₹1.2 కోట్లు, లంకెలపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు పనులకు ₹39.90 లక్షల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రోడ్డు పనులు కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచే నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నెల రోజుల్లోగా రోడ్డు పనులన్నీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

బాధితులకు ₹16 లక్షల ఎల్ఓసీ సహాయం:
ఇటీవల లంకెలపాలెం బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. బాధితుల వైద్య ఖర్చుల నిమిత్తం ₹16 లక్షల విలువైన 'లెటర్ ఆఫ్ క్రెడిట్'  కేటాయించినట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్ & బి ఉమ్మడి జిల్లా ఎస్‌ఈ  కే. జాన్ సుధాకర్, ఈఈ కే.వి. రంగయ్య, డివైఈఈ ఎన్. నరసింహమూర్తి, జేఈలు లలిత, బాలరాజు, ఎంపీడీవోలు పద్మజ, మల్లికార్జున, తహసీల్దార్లు రత్నం, అరుణ్ చంద్ర, మరియు సీనియర్ నాయకులు పంచకర్ల ప్రసాద్ రావు, బలిరెడ్డి అప్పారావు, పైలా జగన్నాధరావు, రైతు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు బొడ్డపు శ్రీనివాసరావు, కర్రీ కనకరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.