BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్

Select Suryaa Now
హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్

సూర్య కరీంనగర్ ప్రతినిధి:తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్)ను ప్రారంభించారు. నూతన కలెక్టరేట్‌ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రావాలని సీఎం ఆకాంక్షించారు.కరీంనగర్ పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు.అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు బయలుదేరారు. సిరిసిల్లలో అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు సమీపంలోని సభా ప్రాంగణం వరకు కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా “చలో సిరిసిల్ల” పిలుపుతో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్నారు.కరీంనగర్‌లో సీఎం పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, అనంతరం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభతో జిల్లాలో రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి.