గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్
గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్
– బుక్కచెర్లలో వృద్ధురాలి మెడలో మూడు తులాల చైన్ అపహరణ
– ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాప్తాడు మేజర్ న్యూస్ :-
రాప్తాడు మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు చెత్త ఊడుస్తున్న వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు చైన్‌ను గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి అపహరించుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.బుక్కచెర్లకు చెందిన నారాయణమ్మ ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని బంగారు చైన్‌ను తెంపుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించింది . ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.