అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఈ- బుక్స్ సదుపాయం ప్రారంభం.
-పోటీ పరీక్ష అభ్యర్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ
సీతమ్మధార సెప్టెంబర్ 30 మేజర్. న్యూస్ ;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో రామా టాకీస్ రోడ్డులోని అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఈ బుక్స్ సదుపాయం కౌంటర్ ను ఏయు మాజీ ఆచార్యుడు ప్రొఫెసర్ చీకట్ల సూర్యనారాయణ, కేజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రంలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్, ఎస్ ఎస్ సి ,బి ఎస్ ఆర్ బి, ఆర్ఆర్ బి ,డిఎస్ సి ,ఎస్ఐ ,కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ చీకట్ల సూర్యనారాయణ లక్ష రూపాయలు డొనేషన్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ తరహా ఈ- బుక్స్ సదుపాయం ద్వారా వేలాది పుస్తకాలు అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విజ్ఞాన కేంద్రం ఎందరో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉందని కొనియాడారు. శిక్షణతో పాటు వారి వసతి సదుపాయం కోసం డార్మెటరీ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ పిసిఎల్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ తదితర సంస్థల సిఎస్ఆర్
నిధులతో పాటు జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్ లు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన అనేకమంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చైర్మన్ గార సత్యనారాయణ, సొసైటీ కార్యవర్గ సభ్యులు కాంతారావు శంకర్రావు సరస్వతి , బివిసి డైరెక్టర్ కోలా హరిబాబు, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ సూర్య, ఇంటి గురుమూర్తి , ఏయూ లైబ్రేరియన్ సంజీవయ్య, అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొన్నారు