రహదారిపై డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
తిరుపతి రూరల్ మండలం పేరూరు ప్రధాన రహదారిపై పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యను తక్షణమేపరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి సోషల్ మీడియా ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యపై రెండు వారాల్లో గడిచిన అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందని ధ్వజమెత్తారు.
జర్నలిస్టు కాలనీకి వెళ్లే ప్రధాన దారిలో దుస్థితి
ఇది జర్నలిస్టు కాలనీకి వెళ్లే ప్రధాన దారి చుట్టుపక్కల అనేక అపార్ట్‌మెంట్లు, విద్యుత్ సబ్ స్టేషన్, పలు విద్యాసంస్థలు, ప్రధాన షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇటువంటి రద్దీ ప్రాంతంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజలు మురుగునీటిలోనే తొక్కుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న పనికే అధికారుల నిర్లక్ష్యం
రెండు ట్రాక్టర్ల మట్టితో, రెండు తూములు వేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని, అంత చిన్న పనిని కూడా ఎందుకు చేయడం లేదో అంతుచిక్కడం లేదన్నారు. చంద్రగిరి స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యపై చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి