BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

రేణిగుంట సబ్-డివిజన్ లో పోలీస్ యాక్ట్ అమలు.............డీఎస్పీ శ్రీనివాసరావు

Select Suryaa Now
రేణిగుంట సబ్-డివిజన్ లో  పోలీస్ యాక్ట్ అమలు.............డీఎస్పీ  శ్రీనివాసరావు

రేణిగుంట: రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 31 యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ  ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుండి 31 వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు  ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.