andhrapradesh
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ
(Mallikarjuna Surya Staff Reporter)
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని హరిత ప్రాంగణంగా అభివృద్ధి చేసే దిశగా 499 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతికుమార్ భూమిపూజ నిర్వహించారు.
ప్రధానమంత్రి ఉన్నత విద్యా పథకం నిధులతో రూ.3.76 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశ్వవిద్యాలయ విద్యుత్ అవసరాలకు సౌరశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వైస్‌చాన్సలర్ తెలిపారు. కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ బి. అనిత, రిజిస్ట్రార్ డా. ఈ. రమేష్ బాబు, ఆర్థిక అధికారి డా. సి. లోకేష్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ప్రధానమంత్రి ఉన్నత విద్యా పథకం పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు.