BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు

Select Suryaa Now
LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు

హైదరాబాద్, సెప్టెంబర్ 30:   నియోగదారులకు ముందుగానే ఖర్చుపై స్పష్టత – పరిశ్రమలకు వేగవంతమైన విద్యుత్ కనెక్షన్లు

తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) ఇటీవల జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఎల్‌టీ (LT) మరియు హెచ్‌టీ (HT) విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీల (USLC) విధానంపై అవగాహన కల్పించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గారు పాల్గొని నూతన విధానం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ( కమర్షియల్) శ్రీ చక్రపాణి గారు   పాల్గొన్నారు.

సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ గారు మాట్లాడుతూ, విద్యుత్ కనెక్షన్ల మంజూరులో పారదర్శకత, సరళత మరియు సమయపాలనకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) తీసుకొచ్చిన యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీల విధానం విద్యుత్ రంగంలో ఒక ముఖ్యమైన సంస్కరణగా నిలుస్తుందని అన్నారు.

గతంలో హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో సర్వీస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎంత దూరం నుంచి లైన్ తీసుకురావాలి, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం ఎంత ఉండాలి వంటి అంశాల ఆధారంగా అంచనా వ్యయాలు మారుతూ ఉండేవని తెలిపారు. కొత్త విధానంలో లోడ్ ఆధారంగా ముందుగానే నిర్ణయించిన స్థిర ఛార్జీలు ఉండటంతో వినియోగదారులకు ఖర్చుపై స్పష్టత లభిస్తుందని చెప్పారు.వినియోగదారులకు ముందుగానే ఖర్చుపై స్పష్టత కల్పించడం, కేసు వారీ అంచనాల వల్ల ఏర్పడే అనిశ్చితిని తొలగించడం, దరఖాస్తుల పరిశీలన మరియు సేవల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను ఈ విధానం అందిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా ఓవర్‌హెడ్ (OH), అండర్‌గ్రౌండ్ (UG) నెట్‌వర్క్‌లకు వేర్వేరు ప్రమాణిత రేట్లు నిర్ణయించడం ద్వారా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందన్నారు. గతంలో అంచనా వ్యయాల్లో 30 నుంచి 40 శాతం వరకు వ్యత్యాసం వచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు అలాంటి అనిశ్చితికి పూర్తిగా తెరపడుతుందని పేర్కొన్నారు.

11 కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) నిర్ణయించిన యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీ ₹4,078 ప్రతి కేవీఏ (kVA). ఈ ఛార్జీకి అదనంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, ఖర్చులు వర్తిస్తాయి.

ఈ యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీల విధానం ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుదీకరించిన నెట్‌వర్క్‌లోని కామన్ ఫీడర్ ద్వారా సరఫరా పొందే మరియు విద్యుదీకరించిన నెట్‌వర్క్ నుండి 1 కిలోమీటర్ మార్గ పొడవు (Route Length) లోపల ఉన్న అర్హత కలిగిన హెచ్‌టీ కనెక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.

1 కిలోమీటర్‌కు మించి లైన్ పొడిగింపు అవసరమయ్యే హెచ్‌టీ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు వర్తించవు. అటువంటి సందర్భాల్లో ప్రస్తుత అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ విధానంలో (Estimate Basis) సర్వీస్ లైన్ అంచనాలు రూపొందించి కనెక్షన్లు మంజూరు చేయబడతాయి.

ఉదాహరణకు 200 కేవీఏ లోడ్ కలిగిన హెచ్‌టీ కనెక్షన్‌కు నిర్ణయించిన యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీ చెల్లించిన తరువాత అవసరమైన నెట్‌వర్క్ విస్తరణ ఫీడర్ ఏర్పాట్లు వంటి సాంకేతిక బాధ్యతలను టీజీఎస్పీడీసీఎల్ నిర్వహిస్తుందని తెలిపారు. వినియోగదారులు ఈ అంశాలపై ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

జీఐఎస్ (GIS) ఆధారిత నెట్‌వర్క్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాల వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తున్నాయని, అయినప్పటికీ లోడ్ ఫీజిబిలిటీ, నెట్‌వర్క్ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని తుది సాంకేతిక నిర్ణయాలను సంస్థే తీసుకుంటుందని వివరించారు.

ఆన్‌లైన్ సేవల ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో, ఎంత ఛార్జీ చెల్లించాలో, ఫైలు ప్రస్తుతం ఎవరి వద్ద ఉందో తెలుసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. దీంతో విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా మారుతుందని చెప్పారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వాతావరణ పరిస్థితుల ప్రభావం, వ్యవసాయ మరియు పారిశ్రామిక అవసరాల మధ్య కూడా టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం కృషి చేస్తున్నారని సీఎండీ పేర్కొన్నారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులకు ఈ విధానం మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు.

అలాగే టీజీఈఆర్సీ రెగ్యులేషన్ నెం.01 ఆఫ్ 2026 ప్రకారం ఎల్‌టీ వినియోగదారులకు కూడా లోడ్ ఆధారిత యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు అమలులో ఉన్నాయని తెలిపారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు తదితర అన్ని కేటగిరీలకు సరళమైన, పారదర్శకమైన విధానం అమలులో ఉండటంతో విద్యుత్ కనెక్షన్ల మంజూరు వేగవంతమవుతుందని చెప్పారు.

TGERC తీసుకొచ్చిన ఈ ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీల విధానం వినియోగదారులకు వ్యయ స్పష్టతను పెంచడం, సేవల అందింపులో అనవసర జాప్యాలను తగ్గించడం, దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను సరళీకరించడం వంటి ప్రయోజనాలను కల్పించనుందని పేర్కొంది.

విద్యుత్ రంగంలో పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని మరింత పెంచే సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

ఈ మార్పు కేవలం ఛార్జీలను నిర్ణయించే ప్రక్రియలో మార్పు మాత్రమే కాకుండా, వినియోగదారులకు మరింత స్పష్టమైన, సమర్థవంతమైన మరియు వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే దిశగా తీసుకున్న ముందడుగుగా చూడవచ్చు.

పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహ మరియు ఇతర వినియోగదారులకు సమానమైన, పారదర్శకమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యుత్ సేవల నాణ్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని చెప్పారు.

ఈ నూతన విధానాల ద్వారా వినియోగదారులకు ముందుగానే ఖర్చుపై స్పష్టత లభించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని టీజీఎస్పీడీసీఎల్  సీఎండీ  తెలిపారు.


వినియోగదారుల సౌలభ్యం, సేవల సరళీకరణ మరియు ఆధునికీకరణ లక్ష్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీజీఎస్పీడీసీఎల్ సంపూర్ణ సహకారం అందిస్తుందని, నూతన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ గారు తెలిపారు.

విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు చాలా తక్కువగా ఉన్నాయని, వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవల విడుదలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ప్రతి సంవత్సరం సగటున 6–7 శాతం మేర పెరుగుతోందని, రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్య పెంపు, ఫీడర్ విభజన, కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎటువంటి ఆలస్యం లేదని, అవసరమైన పత్రాలు లేదా ఛార్జీలు పూర్తి కాని కొన్ని దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. కేబుల్స్, ప్యానెల్స్, మీటర్లు తదితర సామగ్రి సరఫరాను కూడా మరింత సమర్థవంతంగా రూపొందించినట్లు తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఆధారిత ఉత్పత్తితో పాటు సౌర, పవన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), రిన్యూవబుల్ ఎనర్జీ ఆధారిత ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అండర్‌గ్రౌండ్ (UG) కేబ్లింగ్ ప్రాజెక్టును పారదర్శక టెండర్ విధానంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు కింద 33 కేవీ మరియు 11 కేవీ నెట్‌వర్క్‌లను ఆధునీకరించి, SCADA ఆధారిత పర్యవేక్షణతో విద్యుత్ అంతరాయాలను తగ్గించే చర్యలు చేపడుతున్నామని వివరించారు.

నగర విద్యుత్ పంపిణీ వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే టీజీఎస్పీడీసీఎల్ లక్ష్యమని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ గరిష్ట డిమాండ్ నమోదు

12,299 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో కొత్త రికార్డు

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో నేడు సాయంత్రం 4:16 గంటలకు 12,299 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదై సంస్థ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించినట్లు టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు.

నేడు తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ డిమాండ్ 19,400 మెగావాట్లు నమోదు కాగా, అందులో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 12,299 మెగావాట్లు, టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో 6,736 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ రికార్డు స్థాయి డిమాండ్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ విద్యుత్ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించినట్లు సీఎండీ తెలిపారు