BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

Select Suryaa Now
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం
పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన




తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర-దక్షిణ ద్రోణి దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా. మరోవైపు పగటి సమయంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు తీవ్రత కూడా పెరిగింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు హెడ్లైట్ల వెలుతురులోనే కొనసాగుతున్నాయి. దృశ్యమానత తగ్గడంతో డ్రైవర్లు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చల్లటి వాతావరణం, పొగమంచు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వంజంగి, మేఘాలకొండ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతం ప్రస్తుతం చల్లటి వాతావరణంతో పాటు పర్యాటక సందడితో కనిపిస్తోంది