BREAKING
సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎయిర్ ఇండియా నూతన సీఈవోగా తెవోల్డే గెబ్రెమరియం నియామకానికి కేంద్రం సెక్యూరిటీ క్లియరెన్స్ తీర ప్రాంతాల రక్షణకు 'నేషనల్ కోస్టల్ మిషన్ 2.0' దేశంలో వైద్యరంగ విప్లవం, లక్షా ఎనభై ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు రాష్ట్రపతి భవన్‌లో అక్టోబర్ 3న గార్డ్ మార్పిడి వేడుక రద్దు 37 ఏళ్ల పోలీస్‌ సేవలకు వీడ్కోలు – రిటైర్డ్‌ పోలీసు అధికారులకు సన్మానం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ రక్షణ భూముల యాజమాన్యంలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యవసరం స్విమ్స్‌లో అధునాతన శస్త్రచికిత్స -60 ఏళ్ల మహిళకు ప్రాణాలు నిలిపిన వైద్యులు ప్రయాణికుల ఆరోగ్య రక్షణే ధ్యేయం: బెంగాల్‌లో 7,300కు పైగా నీటి ట్యాంకులను శుభ్రం చేసిన ఈస్టర్న్ రైల్వే.. మెకానికల్ స్వీపింగ్‌కు సీఎం రేఖా గుప్తా పెద్దపీట ఆసియా క్రీడల మహిళల హాకీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ విజయం ఆసియా క్రీడల్లో స్వర్ణాల మోత, ఆర్చరీలో భారత్‌కు మరో మూడు పసిడి పతకాలు పడిపోయిన స్టాక్ మార్కెట్లు

కాంగ్రెస్ పథకాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం

Select Suryaa Now
కాంగ్రెస్ పథకాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు,  స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ / పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారని సత్తుపల్లి  శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. కల్లూరు మండలంలోని పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి, ఎర్ర బోయినపల్లి, చెన్నూరు గ్రామాలలో బుధవారం ఆమె పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 71 మంది లబ్ధిదారులకు  19,14,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మమేకమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంసీ చైర్మన్ భాగం నీరజ, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.