పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి..
Mallikarjuna Surya Staf Reporter
పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్ బచావో కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పరిశీలించారు. సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఒక్కో గదిలో 75 మంది వరకు కూర్చోవాల్సి వస్తోందన్నారు. అసంపూర్తిగా ఉన్న నాడు–నేడు రెండో విడత పనులను పునఃప్రారంభించి అదనపు తరగతి గదులు, క్రీడా మైదానం, ప్రత్యేక భోజనశాల ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలపై నివేదిక రూపొందించి కలెక్టర్, డీఈవోలకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, విజయ్, నాగభూషణ్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.