కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులోని డా యస్ ఆర్ జె డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సనిశెట్టి రాధాకృష్ణయ్య కాలేజీని సమర్ధవంతంగా నిర్వహించారని కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు పేర్కొన్నారు. ఇటీవల రాధాకృష్ణయ్య గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన సంస్మరణ సభను బుధవారం స్థానిక ఎస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోళ్ల వరకుమారి, పి డి సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ డా. టి.శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ పి మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాధాకృష్ణయ్య కరస్పాండెంట్ గా ఎంతోమందికి ఆదర్శం అన్నారు.
విద్యార్థులను, అధ్యాపకులను సొంత కుటుంబంతో సమానంగా చూసుకొనే వారన్నారు. జీతాలు, ఇంక్రిమెంట్లు వంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేవారని పేర్కొన్నారు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. స్వతహాగా అధ్యాపకులు అయినందున కరస్పాండెంట్ లా కాకుండా తమలో ఒకరిలా మెలిగారన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని విద్యార్థులు, అద్యాపకులు మౌనం పాటించి భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె.కాత్యాయని, అంకమ్మ, సుప్రియ, రేణుక, శ్రీనివాసులు, వెంకట్రావు, రవీంద్ర,
రాజమోహన్,కొండయ్య , విజయకుమారి విద్యార్థులు పాల్గొన్నారు.