ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన
ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన = గుండె సమస్యలపై స్పెషల్ ప్యాకేజీ సూర్య, ఒంగోలు: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ మార్తాండం వెంకటేష్ గారు తమ విలువైన వైద్య సలహాలు అందించారు. మారుతున్న జీవన విధానం (Lifestyle changes) కారణంగా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బుల (Heart Diseases) బారిన పడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు, నేడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు... మారుతున్న జీవనశైలిలో గుండె వ్యాధులకు దారితీస్తున్న ముఖ్య కారణాలను డాక్టర్ గారు తెలియజేశారు
తీవ్రమైన ధూమపానం మద్యపానం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలాగే జన్యుపరమైన లక్షణాలను ముఖ్య కారణాలుగా తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన అలవాటులను మార్చుకుంటే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు అని తెలిపారు. రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకం తగ్గించడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం , నిరంతర బాడీ హెల్త్ చెకప్ చేయించుకోవడం వలన గుండె జబ్బులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చు అని తెలియజేశారు. చిన్న వయసులోనే చాలామంది గుండె వ్యాధుల బారినపడి చనిపోతున్నారని... జన్యుపరమైన లక్షణాలు, మరియు తీవ్రమైన ఒత్తిడి,అలాగే తీవ్రమైన డీజే శబ్దాల వలన కూడా గుండె కొట్టుకునే వేగం లో మార్పు వచ్చి హఠాత్తుగా గా కుప్ప కూలిపోతున్నారు అని తెలియజేశారు...
ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి గారు మాట్లాడుతూ ఉపాస్ హాస్పిటల్ నందు గుండె వైద్య విభాగం అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్యం అందిస్తుందని విశేష అనుభవం కలిగిన గుండె వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో గుండె వైద్య విభాగం చాలా దృఢంగా ఉందని తెలియజేశారు.
ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చవల గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలకు మెరుగైన గుండె వైద్యం అందించాలన్న సంకల్పంతో , పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరతో కార్డియాలజీ ప్యాకేజీ ను ప్రవేశ పెట్టడం జరిగిందని... కేవలం 999/- రూపాయలకు అన్ని గుండె పరీక్షలు అందుబాటులో ఉన్నాయి అని, అలాగే
7999/- రూపాయలకు యాంజియోగ్రామ్ ప్యాకేజ్ చేయబడుతుంది అని తెలియజేశారు... ఇంతకుముందు గుండె సమస్యలు ఉన్నవారు మరియు గుండె చెకప్ చేయించుకోవాలి అనుకున్న వారు... ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.
ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డేస్ సందర్భంగా ఒక వారం రోజులపాటు కార్డీయాలజీ విభాగానికి ఉచిత ఓపి ఇవ్వడం జరుగుతుంది అని.. పేద మరియు మధ్యతరగతి ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఉపాస్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె స్టెంట్ లు వేయడం జరుగుతుందని , గుండె వ్యాధులతో బాధపడే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రానున్న రోజుల్లో అత్యాధునిక లైఫ్ సేవర్ ఎక్మో వైద్య విధానం కూడా అందుబాటులో తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాస్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ ఖాసిం సైదా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.