BREAKING
జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత ప్రత్యేక అభియాన్ 6 కోసం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సన్నాహకాలు ముమ్మరం

కరాటి శిక్షకుడుకు అంతర్జాతీయ గుర్తింపు

Select Suryaa Now
కరాటి శిక్షకుడుకు అంతర్జాతీయ గుర్తింపు

తిరుపతి కరాటే రంగానికి అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు లభించింది. నగరానికి చెందిన కరాటే శిక్షకుడు రెన్షి వెంకటేశ్వర్లు జపాన్‌లోని యోకోహామాలో డబ్ల్యూఎస్‌కేఎఫ్‌ 1వ డాన్‌ గ్రేడింగ్‌ సర్టిఫికేట్‌ అందుకున్నారు. కర్ణాటక క్రీడా ప్రాధికార సంస్థ ఉపాధ్యక్షుడు అరుణ్‌ మచయ్య చేతుల మీదుగా ఆయన ఈ సర్టిఫికేట్‌ను స్వీకరించారు.తిరుపతిలో కరాటే శిక్షణ అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వెంకటేశ్వర్లు, నిరంతర సాధన, క్రమశిక్షణతో డాన్‌ గ్రేడింగ్‌ సాధించారు.కరాటేలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ గుర్తింపు ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు. యోకోహామాలో సర్టిఫికేట్‌ అందుకోవడం తన కరాటే ప్రస్థానంలో చిరస్మరణీయమైన ఘట్టమని పేర్కొన్నారు.తన కరాటే ప్రయాణంలో గురువు క్యోషి కోల ప్రతాప్‌కుమార్‌ అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతో కీలకమని వెంకటేశ్వర్లు తెలిపారు. గురువు సూచనలతో సాధనను కొనసాగిస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు.తిరుపతిలోని వెంకీ మార్షల్‌ ఆర్ట్స్‌ ద్వారా కరాటే శిక్షణ అందిస్తున్న ఆయన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నారు.జపాన్‌లో డాన్‌ గ్రేడింగ్‌ సర్టిఫికేట్‌ అందుకోవడం పట్ల ఆయన శిష్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.