BREAKING
విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ

పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఓటమిని జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికలను రద్దు చేయించారన్న వైయస్సార్‌సీపీ

Select Suryaa Now
పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఓటమిని జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికలను రద్దు చేయించారన్న వైయస్సార్‌సీపీ

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో స్కూల్ కమిటీ ఎన్నికలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొడవలి పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెండవసారి కూడా ఛైర్మన్‌గా ఘన విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఉన్న మూడు పాఠశాలలకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే, ఎంపీపీ యూపీ పాఠశాల కమిటీకి జరిగిన ఎన్నికల్లో జనసేన ఛైర్మన్ అభ్యర్థి నూకరాజుపై వైసీపీ అభ్యర్థి శివ నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. సొంత నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థుల ఓటమిని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తదితరుల ఒత్తిడి మేరకే అధికారులు ఎన్నికలను రద్దు చేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ఫలితాలను అడ్డుకున్నారని విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.