BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు వ్యాపారులకు ఊరట: యూపీఐ లావాదేవీలపై 0.28% ఎండీఆర్ మాఫీని పరిశీలిస్తున్న ఇండియన్ బ్యాంక్.. ఎండీ & సీఈవో బినోద్ కుమార్ వెల్లడి! ‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం

సర్వీస్ అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు: మాదాపూర్ పోలీసులు హెచ్చరిక

Select Suryaa Now
సర్వీస్ అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు: మాదాపూర్ పోలీసులు హెచ్చరిక

సూర్య హైదరాబాద్ డెస్క్: బర్త్‌డే పార్టీల పేరుతో కొన్ని సర్వీస్ అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు పోలీసుల దాడుల్లో వెలుగుచూశాయని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు హెచ్చరించారు. అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుంటున్నవారు ఎవరూ? ఎంతమంది వస్తున్నారు? ఏ ఉద్దేశంతో వస్తున్నారనే పూర్తి వివరాలు తెలుసుకోకుండానే కొందరు యజమానులు, మేనేజర్లు గుడ్డిగా గదులు అద్దెకు ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఘటనలపై ఇప్పటికే రెండు, మూడు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొన్ని ప్రాపర్టీలను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిపారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లను ఇతరులకు అద్దెకు ఇచ్చేముందు వచ్చే వ్యక్తుల పూర్తి వివరాలు, వారి సంఖ్య, నిర్వహించే కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని యజమానులు తప్పనిసరిగా పరిశీలించాలని స్పష్టం చేశారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లలో ఎలాంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినా యజమానులతో సహా బాధ్యులందరిపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.