BREAKING
జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత ప్రత్యేక అభియాన్ 6 కోసం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సన్నాహకాలు ముమ్మరం

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత

Select Suryaa Now
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత

- రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్ స్వాధీనం.. ఒకరు అరెస్ట్

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో భారీగా కొకైన్‌ను తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్‌ఐ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో దోహా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడిపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం అతని క్యాబిన్‌ బ్యాగేజీని తనిఖీ చేయగా ఏడు చాక్లెట్‌ ట్యూబ్‌లలో అనుమానాస్పద పదార్థం గుర్తించారు.
ట్యూబ్‌లను తెరిచి పరిశీలించగా చాక్లెట్ల మధ్య 207 అండాకారపు క్యాప్సూల్స్‌లో తెల్లటి పొడి పదార్థాన్ని దాచినట్లు గుర్తించారు. నార్కోటిక్‌ డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్‌తో పరీక్షించగా అది కొకైన్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 4.9 కిలోల కొకైన్‌ను జప్తు చేసి, నిందితుడిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం–1985 కింద కేసు నమోదు చేశారు. కొకైన్‌ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేయాల్సి ఉంది, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- పోతుల నర్సింహా : మేజర్ న్యూస్, షాబాద్.