BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి

Select Suryaa Now
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి

శిక్షణ పొందిన మహిళలు నైపుణ్యాలను ఆచరణలో పెట్టి పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి శోభామణి, ఐసీఏఆర్ నార్మ్ ప్రిన్సిపల్ సైంటిస్ డాక్టర్ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ ఐసీఏఆర్ నార్మ్ సహకారంతో మహిళలకు గోమయ ఆధారిత ఉత్పత్తుల తయారీపై నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ గోమయాన్ని విలువైన మార్కెటబుల్ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా స్వయం ఉపాధిని పొందడంతో పాటు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు గోమయ ఉత్పత్తుల తయారీ, మాన్యువల్ మౌల్ట్స్, యంత్రాల వినియోగం, విలువ జోడింపు, మార్కెటింగ్, ఎగుమతులు, యూనిట్ నిర్వహణ, ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజాత, కోఆర్డినేటర్లు డాక్టర్ శ్వేత కాంతి, డాక్టర్ మంజరి, డాక్టర్ రెడ్డి వరప్రసాద్, ట్రైనర్లు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు