BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్

Select Suryaa Now
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్

(Mallikarjuna Surya Staff Seporter)

న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, వేధింపులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్ డిమాండ్ చేశారు. బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ప్రజల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న భద్రతా సమస్యలకు సమగ్ర చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల విజయవాడలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదుల సంఘాలతో సంప్రదించి రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి, మల్లేష్, నాగభూషణ, మంజునాథ్, శ్రీనివాసులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.