BREAKING
పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత ప్రత్యేక అభియాన్ 6 కోసం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సన్నాహకాలు ముమ్మరం రూ.11.50 కోట్లతో రోడ్ల నిర్మాణం : శంకుస్థాపన చేసిన గంటా రేణిగుంట సబ్-డివిజన్ లో పోలీస్ యాక్ట్ అమలు.............డీఎస్పీ శ్రీనివాసరావు

క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం..

Select Suryaa Now
క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం..

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; రీజియాన్ చైర్ పర్సన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు క్రీడలకు క్రీడాకారులకు విద్యార్థులకు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను చైతన్య పరచడమే డైమండ్ లయన్స్ లక్ష్యం అని అన్నారు. తాడేపల్లిగూడెం బాలికోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వనిత లయన్స్ చేస్తున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తూ నూతనంగా నిర్మాణమైన హై జంప్ కోర్టును పట్టణ జనసేన నాయకులు చేపల రమేష్ డైమండ్స్ లయన్స్ క్లబ్ ట్రెజరర్ లయన్ కాళ్ల గోపికృష్ణలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపల రమేష్ మాట్లాడుతూ బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు లయన్స్ క్లబ్ సహకారం స్ఫూర్తిదాయకం అన్నారు. వనిత లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ కాళ్ల అరుణ కుమారి అభివృద్ధి పనులు చేపట్టారు. లయన్ కాళ్ళ గోపికృష్ణ మాట్లాడుతూ ఈ స్కూలు ఉపాధ్యాయులు సిబ్బంది ప్రోత్సాహంతో మంచి ఉత్తీర్ణత సాధించాలని చీఫ్ విప్ లయన్ బొలిశెట్టి శ్రీనివాసరావు కృషితో మరిన్ని పాఠశాలలో అభివృద్ధి జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమం లో కొత్తపల్లి విష్ణు ఇంద్ర వాణి ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం.