BREAKING
జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత ప్రత్యేక అభియాన్ 6 కోసం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సన్నాహకాలు ముమ్మరం

గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు.

Select Suryaa Now
గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు.

గన్నవరం, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్.

గన్నవరంలో మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అక్బర్‌ బాబా ఆధ్వర్యంలో గన్నవరం జెండా చెట్టు వద్ద నుంచి మహబూబ్‌ సుభాని గంధం మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన గంధం ఊరేగింపు గన్నవరం పురవీధుల మీదుగా వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి దర్గా నిర్వాహకులు అల్తాఫ్‌ బాబా హాజరై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌ సుభాని వంటి మహనీయుల స్మరణార్థం ఇలాంటి దైవ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. భక్తి, సోదరభావం, మత సామరస్యాన్ని చాటేలా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.