అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
- వేటకు ఉపయోగించిన క్లచ్ వైర్ ఇతర పరికరాలు స్వాధీనం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చండ్రగొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి కే తేజస్వీ తెలిపారు. బుధవారం చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ కార్యక్రమంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చండ్రుగొండ అటవీ రేంజ్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి పందిని వేటాడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. అదే సమయంలో అనుమాన స్పదంగా ఉన్న పనితి నరేష్, మల్ల శ్రీనివాసరావు, అనే ఇద్దరు వ్యక్తులు ఒక సంచితో వస్తుండ టాన్ని గమనించి వారిని ఆపి తనిఖీ చేయగా. వారి వద్ద రక్తపు మరకలు సంచిలో అడవి పంది వేటకు ఉపయోగించిన క్లచ్ వైర్, లభించాయన్నారు. వెంటనే ప్రశ్నించగా అడవి పందిని వేటాడినట్టు ఒప్పుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా అడవి పంది మృతదేహం (కార్కస్), గుర్తించ బడిందన్నారు. వారి వద్ద నుంచి వేటకు ఉపయోగించిన సామగ్రిని, స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972, అలాగే సంబంధిత అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. వన్యప్రాణులను అక్రమంగా వేటాడటం, ఉచ్చులు లేదా ఇతర అక్రమ పద్ధతులతో పట్టుకోవడం, చంపడం, వాటి మాంసం లేదా మృతదేహాన్ని అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. వన్యప్రాణి నేరాలకు సంబంధించి నేరం రుజువైన పక్షంలో వైడ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లోని వర్తించే నిబంధనల ప్రకారం జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. వన్యప్రాణులపై జరిగే అక్రమ వేట, ఉచ్చుల ఏర్పాటు మరియు ఇతర నేరాలపై అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చంద్రుగొండ అటవీ రేంజ్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక నిఘా, గస్తీ, చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి అన్నారు. అడవి జంతువులను వేటాడటం, చంపడం లేదా వేటకు సంబంధించిన పరికరాలను ఉపయోగించడం చట్టరీత్యా నేరమన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని, అక్రమ వేటకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..