స్థానిక సంస్థల ఎన్నికలపై రేపే తీర్పు.. నోటిఫికేషన్‌పై ఉత్కంఠ
అమరావతి, సూర్య న్యూస్ నెట్వర్క్ :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. మొత్తం ఐదు పిటిషన్లపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది. అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. మరోవైపు నిర్ణీత సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది.
పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలైంది. ఈ అంశాలతో కలిపి మొత్తం ఐదు పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాలు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.