BREAKING
ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్

ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్

Select Suryaa Now
 ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్

ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్ 

 నరసాపురం, మేజర్ న్యూస్ :

 ప్రధాన ఎన్నికల అధికారిని  తొలగించి,ఎస్ ఐ ఆర్ ను నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి. మోడీ అమిత్ షా నియంతృత్వం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్ధి రాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య  వస్థగా కొనసాగుతున్న భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టమైనదని అట్లాంటి వ్యవస్థను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బలహీనపరిచే విధంగా వ్యవహరించిందన్నారు. దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించే విధంగా ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ పద్ధతి ద్వారా 13 కోట్ల పైగా ఓటర్ లిస్టులో పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమేనన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ కనుసనల్లో పనిచేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమారును తక్షణం తొలగించాలన్నారు. ఫారం 6 మార్పులపై వచ్చిన అభ్యంతరాలను సరి చేయాలన్నారు. కొత్త ఓటర్లు జాయినింగ్ పాత వాటర్ మార్పులు చేర్పులు ప్రక్రియ విధానంలో వీఆర్వో స్థాయిలో ఉన్న నిర్ణయ అధికారాన్ని సెంట్రలైజేషన్ పద్ధతిలో ఓట్లు తొలగించే పద్ధతిని నిలుపుదల చేయాలన్నారు. ఓట్లు తొలగింపు చేర్పుల్లో అనేక అశాస్త్రీయ పద్ధతులు జరుగుతున్న  ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్రావు. మొగల్తూరు మండల కార్యదర్శి ఎడ్ల చిట్టిబాబు పట్టణ కమిటీ సభ్యులు పొగాకు నారాయణరావు మంచిలి నీలకంఠం నోముల కొండ మల్లు గుంట నాగలక్ష్మి మండల కమిటీ సభ్యులు గుత్తుల శ్రీరామచంద్రుడు గుబ్బల చిన్ని కవురు శ్రీనివాస్ పిల్లి కామేశ్వరరావు దొంగ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 ఇజ్రాయిల్ నర్సాపూర్