BREAKING
ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్

దత్తత తీసుకోవటం మానవత్వం జిల్లా కలెక్టర్

Select Suryaa Now
దత్తత తీసుకోవటం మానవత్వం  జిల్లా కలెక్టర్

దత్తత తీసుకోవటం మానవత్వమని, అమ్మతనానికి  అందం, కుటుంబానికి ఆనందమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  స్థానిక కలెక్టరేట్లో మంగళవారం   బేబీ కృతిక అను 3 నెలల వయస్సు గల పాపను దత్తతను ఇచ్చిన  చెన్నై , తమిళనాడు కి చెందిన కుమారీ,  మధు శ్రీనివాసన్ దంపతులకు ఫైనల్ అడాప్షన్ ఆర్డర్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు.   జూలై 23వ తారీఖు న ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ లో  స్థానిక శిశు గృహ లో తాత్కాలిక వసతి పొందిన బేబీ కృతిక అను 3 నెలల వయస్సు గల పాపను చెన్నై , తమిళనాడు కి చెందిన కుమారీ మధు శ్రీనివాసన్ అను వారకి  బేబీ కృతిక నీ దత్తత  ఇచ్చారు.  60 రోజుల నిర్ణీత సమయం  పూర్తి అయిన  అనంతరం ఫైనల్ అడాప్షన్ ఆర్డర్ ను కలెక్టర్   దత్తత తల్లిదండ్రులకు అందించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిల్లలలను దత్తత తీసుకున్న తల్లితండ్రులు వారిని ప్రేమగా పెంచి  జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి విద్య నేర్పించి అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి  సిహెచ్. సూర్య చక్రవేణి , డిసిపియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము