BREAKING
అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ ల విభజన* లారీ దగ్ధం సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం ఘనంగా పోషణ మాసోత్సవాలు -గర్భిణులకు సీమంతాలు, పోషకాహారంపై అవగాహన గుండెను కాపాడుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు. కోదాడ (మేజర్ న్యూస్) ​విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన.... మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి. మౌలిక వసతులు అభివృద్ధి పనులపై దృష్టి ప్రభుత్వ సంక్షేమ-- అభివృద్ధి ప్రాధాన్యత అంశాలపై అధికారులు దృష్టి సారించాలి కాకొల్లువారిపల్లెలో పల్లె పండుగ పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు ఆగమ సలహాదారుకి పార్థసారథి భట్టాచార్య పురస్కారం

మోదీ సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
మోదీ సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం

చౌటుప్పల్‌:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాల సేవలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరు శివారులోని సాయి యాదాద్రి సేవా ఆశ్రమంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన వితరణను ప్రారంభించారు.ఈ సందర్భంగా జక్కలి రాజు యాదవ్‌ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాసేవకు అంకితమై దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ సేవా ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అన్నదానం వంటి కార్యక్రమాలు మానవతా విలువలను చాటిచెబుతాయని, సేవా భావాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జక్కలి రాజు యాదవ్‌ కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి,బీజేపీ పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్, కడారి కల్పన ఐలయ్య యాదవ్,ఓబీసీ మోర్చా పట్టణ, మండల అధ్యక్షులు చీకురి సాయిరాం, నాతి సురేష్, మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం,పార్టీ ప్రధాన కార్యదర్శి యాస అశోక్ రెడ్డి,బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్,ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి,గుండెపురం ప్రతిభ నరేష్, తెలుకుంట్ల శ్రీధర్,రేఖ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.