BREAKING
కొబ్బరికాయలో శివలింగాకారం.. భక్తులలో భక్తిభావం ! సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!?

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు

Select Suryaa Now
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు 

 పాలకొల్లు, నరసాపురం, మేజర్ న్యూస్ :

చేనేత సమస్యలు పరిష్కారనకై అక్టోబర్ 2న జరిగేధర్నాను జయప్రదం చేయాలనిఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చల్ల వీరభద్రుడు కోరారు. మంగళవారం

దగ్గులూరుస్థానిక తూర్పు వీధిలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు చల్ల వీరభద్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నేతన్న సేవా పథకం రెండవ విడత కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి తక్షణమే రూ. 25,000/- ఆర్థిక సాయాన్ని జమ చేయాలి. ఎలాంటి కోతలు లేకుండా అర్హులైన అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలి.

50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్ల మంజూరులో ఉన్న కఠినమైన నిబంధనలను, షరతులను వెంటనే సడలించాలన్నారు.అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి తక్షణమే పింఛను మంజూరు చేయాలనిచేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ రెండు గాంధీ జయంతిరోజున రాష్ట్ర పిలుపుమెరకు దగ్గులూరు గాంధీ విగ్రహం వద్ద జరిగే ఈ ధర్నలో కార్మికులు, నాయకులు, చేనేతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాలో పాల్గొవాలని కోరారు.ఈ సమావేశంలో బోప్పే శంకరం,అల్లం పుల్లయ్య,అందే వీరభద్రుడు,విశ్వనాదుల సత్యనారయణ,జాన సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు.