BREAKING
సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్

సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం

Select Suryaa Now
సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం

సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం
నరసాపురం, మేజర్ న్యూస్ :
స్థానికబస్టాండ్ సమీపంలోని మీరా గ్రంథాలయంలో సీపీఎం (మార్క్సిస్టు పార్టీ) నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం  ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా శిబిరానికి పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.
ఉదయం జరిగిన తొలి సెషన్‌లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు "పార్టీ నిర్మాణం" అనే అంశంపై ముఖ్య వక్తగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం సెషన్ లో ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కర్రీ నాగేశ్వరరావు వివరించారు.
ఈ తరగతులకు నరసాపురం, మొగల్తూరు మండలాలు సహా పట్టణ పరిధి నుంచి సుమారు 90 మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
సీపీఎం నాయకులు జల్లి రామ్మోహన్, యడ్ల చిట్టిబాబు,పొగాకు నారాయణ రావు,పిల్లి కామేశ్వరరావు, గుత్తుల శ్రీరామచంద్రుడు, వేండ్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.