విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలి ఎంఈఓ సునీత
చెన్నూరు మండలంలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
చెన్నూరు మేజర్ న్యూస్:
విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఎంఈఓ సునీత అన్నారు.చెన్నూరు మండలంలోని 41 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ సునీత తెలిపారు.మండలంలోని ఉప్పరపల్లి ఎంపీయూపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌గా ఓబులమ్మ, వైస్‌చైర్‌పర్సన్‌గా నరసమ్మ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఎంఈఓ సునీత మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో ఎస్‌ఎంసీ సభ్యులు భాగస్వాములై సహకరించాలని కోరారు.ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఎంసీ సభ్యులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.