BREAKING
అన్నదాన పథకానికి రూ1,00,001 ఇచ్చిన కుందూరు కుటుంబసభ్యులు రాబిస్ నివారణకు సమిష్టి కృషి అవసరం రేబిస్ వ్యాధి అవగాహన పోస్టర్ ఆవిష్కరణ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి లైనప్.. స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలి మెడికల్ సీటు సాధించిన మహేశ్వరికి బీఎస్ఆర్ అభినందనలు వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సద్దలతో కాటసాని ఆత్మీయ కలయిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్ దుల్కర్ సల్మాన్ కీలక హెచ్చరిక.. ఆ ఫేక్ అకౌంట్‌ను నమ్మి మోసపోవద్దంటూ పోస్ట్ స్వర్ణగ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ సొంతింటి కలకు మంత్రి నారా లోకేష్‌ చేయూత నంద్యాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై అంబరాన్నంటిన సంబరాలు

విద్యార్థులకు 7,300 సైకిళ్ల పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు 7,300 సైకిళ్ల పంపిణీ

అనంతపురం బ్యూరో 

 

విద్యార్థులకు 7,300 సైకిళ్ల పంపిణీ

కళ్యాణదుర్గం: విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టిన ‘అమిలినేని విద్యాచక్రం’ కార్యక్రమంలో భాగంగా కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఒక్కరోజే సుమారు 1,500 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేయగా, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 7,300 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.

ఎస్సార్సీ ట్రస్ట్, సంస్థ సిబ్బంది సహకారంతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు త్వరలో 500 మంది డిగ్రీ విద్యార్థులకు సైతం సైకిళ్లు అందిస్తామని ప్రకటించారు.

నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీలో డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, రానున్న రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బీటీపీ ప్రాజెక్టును 2028 మార్చి నాటికి పూర్తి చేసి నీటిని అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్‌రెడ్డి, ఎస్సార్సీ ఎండీ అమిలినేని యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.