రేబిస్ వ్యాధి అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
‘ప్రపంచ రేబీస్ దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి- ప్రతినిధి
ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు , జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సోమవారం ప్రపంచ రేబీస్ దినోత్సవం - 2026 పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ , జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ పి. జితేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రేబీస్ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. కుక్క కాటుకు గురైనప్పుడు వెంటనే తగిన వైద్య సహాయం పొందడం ద్వారా రేబీస్ బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని వారు చెప్పారు.