BREAKING
మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి

ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

Select Suryaa Now
ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ  సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

సంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రక్రియలో పారదర్శకత కోరుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.నిరసన ర్యాలీలో నిర్మలా జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటర్ల జాబితా నిర్వహణలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం సార్ ప్రక్రియ చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే జరుగుతోందని, అర్హత లేని లేదా మరణించిన, నకిలీ ఓటర్లను గుర్తించడం వంటి చర్యల్లో భాగంగానే సవరణలు చేపడుతున్నట్లు చెబుతోంది.