విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొందుర్గ్ మండల వైద్యాధికారి డాక్టర్ తబుసుం కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నాశ ముక్త్ భారత్ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తబుసుం మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడవద్దని, దాని వల్ల ఆరోగ్యంతో పాటు జీవితం రెండు పాడవుతాయని, అపరిచితులు ఇచ్చిన పదార్థాలు తినరాదని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకునే వారు ఉంటే మీ ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి ప్రమాదమే కాకుండా చట్ట రీత్యా నేరమని, దీనివల్ల భవిష్యత్తును చేతులారా పాడు చేసుకోవద్దని కోరారు. మత్తు పదార్థాల జోలికి ఎప్పుడు వెళ్లబోమని, ఎవరైనా వాడితే ఉపాధ్యాయులకు తెలియజేస్తామని, సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి కాపాడుతామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.