BREAKING
వయోవృద్ధుల సంక్షేమం, సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌.. టిష్యూ కల్చర్ అరటికి రెండేళ్ల పాటు రాయితీ స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు హైకోర్టులో ఊరట: నెట్, సెట్ అర్హతలకు మరో రెండేళ్ల గడువు గుండె హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు!* పీజీఆర్‌ఎస్ అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి రైలు ఢీకొని యువకుని మృతి రైల్వే ఎస్ఐ సాధు లింబాద్రి రేబిస్ నివారణకు సమష్టి కృషి అవసరం రాజీవ్ నగర్ కాలనీవాసుల ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలి అన్నా అని పిలిచా కదరా.. బిగ్‌బాస్ హౌస్‌లో కత్తుల టాస్క్‌తో తారస్థాయికి గొడవలు ఎస్సీ యువతకు గోల్డెన్ ఛాన్స్ అంచనాలు పెంచేస్తున్న నితీష్ తివారీ రామాయణం పోస్టర్స్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ లుక్స్ వైరల్ రాష్ట్ర నాయకత్వాన్ని కలిసిన పులివెందుల ఏపీ ఎన్జీవోస్ ఉద్యోగులు

prabhas-releases-romeo-juliet-movie-story-glimpse

Select Suryaa Now
prabhas-releases-romeo-juliet-movie-story-glimpse

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా చిత్రం రోమియో జూలియట్. భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా సినిమా విడుదల తేదీకి ముందే మేకర్స్ వినూత్న రీతిలో స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ గ్లింప్స్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ గ్లింప్స్ పూర్తిగా భిన్నమైన కాంటెంపరరీ ట్రీట్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమా విడుదల వరకు కథను గోప్యంగా ఉంచే ట్రెండ్‌కు భిన్నంగా, మేకర్స్ ముందుగానే కోర్ పాయింట్‌ను రివీల్ చేయడం వారి కంటెంట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. గ్లింప్స్‌లో హీరో ఒక లోకల్ గన్ డీలర్ దగ్గర ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం, ఓ అమ్మాయిని చంపే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం వంటి బోల్డ్ అంశాలతో కథ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మోడరన్ రిలేషన్షిప్స్ చుట్టూ తిరిగే సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం పరిచయం చేయనుందని గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

నేటి తరంలో వన్ నైట్ స్టాండ్, హుక్‌అప్, ఫ్లింగ్, బెంచింగ్, సిట్యుయేషన్‌షిప్, బాయ్ బెస్టీ వంటి సరికొత్త పదాలు, నేటి రిలేషన్‌షిప్ టెర్మ్స్‌ను హీరో వివరించే విధానం యువతను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యూత్‌ను టార్గెట్ చేస్తూ వాళ్లకు నట్టే భాషలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గోపి సుందర్ సంగీతం, అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ బోల్డ్ జెన్-జీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అక్టోబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.