BREAKING
తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం శివకార్తికేయన్‌తో విభేదాలపై స్పందించిన వెంకట్ ప్రభు.. ఆ వార్తలపై క్లారిటీ prabhas-releases-romeo-juliet-movie-story-glimpse ఏఐ-ఆధారిత ఫార్మకోవిజిలెన్స్ పై శిక్షణ ఐఐటీ హైదరాబాదు నిపుణులతో గీతం ఫార్మసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం కావాలి. షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. ఏ ఐ సి టి యు డిమాండ్. చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ఓ అందాల రాక్షసీ హీరో షిరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.. రూ.70 కోట్లతో పాఠశాలల ఆధునీకరణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రమాదకర స్టంట్లతో యువకుడు అల్ చల్.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు

అన్నదాన పథకానికి రూ1,00,001 ఇచ్చిన కుందూరు కుటుంబసభ్యులు

Select Suryaa Now
అన్నదాన పథకానికి రూ1,00,001 ఇచ్చిన కుందూరు కుటుంబసభ్యులు

నారాయణస్వామి దేవస్థానం ఆదాయం రూ. 2,00,309 

సిఎస్ పురం,మేజర్ న్యూస్ :  ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణకు పామూరు మండలలోని  చట్టుమడుగు గ్రామానికిచెందిన   కుందూరు శివరామయ్య చౌదరి - జయలక్ష్మి దంపతులు కుమారుడు కుందూరు బాలకృష్ణ , రాజ్యలక్ష్మి దంపతులు 1,00,001 రూపాయలు విరాళం అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజ నరసింహబాబు తెలిపారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ నారాయణస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం 2,00,309 రూపాయలు వచ్చినట్లు వీటిలో పూజాటికెట్లు విక్రయం ద్వారా 54,170 లడ్డుప్రసాదం అమ్మకం ద్వారా 22,340 శాశ్వత అన్నదాన పథకానికి 1,23,799 మొత్తం 2,00,309 రూపాయలు వచ్చినట్లు ఈఓ తెలిపారు. ఈసందర్భంగా శాశ్వత అన్నదాన పథకానికి 1,00,001 రూపాయలు విరాళం అందజేసిన దాతలు కుందూరు శివరామయ్య చౌదరి శ్రీమతి జయలక్ష్మి దంపతులు కుమారుడు కుంరూరు బాలకృష్ణ శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులను ఈఓ స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది,దాతలు పాల్గొన్నారు.