ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలి
Lప్రతీ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలి*
*కమిషనర్ రాహుల్ మీనా*
*నగర కార్పొరేషన్ పీజీఆర్ఎస్ కు 25 వినతులు*
ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతతో స్వీకరించి.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. వాటిని సంబంధిత విభాగాధిపతులకు పంపించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిగణించి, సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. రికార్డులు, నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించి నాణ్యతతో సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ కు ఆస్కారం లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే ప్రజల నుంచి అందే ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 25 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 10, రెవెన్యూకి సంబంధించి 4, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 6, హౌసింగ్ కు సంబంధించి 2, వార్డు సచివాలయాలకు సంబంధించి మూడు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.