మెడికల్ సీటు సాధించిన మహేశ్వరికి బీఎస్ఆర్ అభినందనలు
పెద్దేముల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి. చెన్నప్ప కుమార్తె సి. మహేశ్వరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జయశంకర్ భూపాలపల్లిలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) మహేశ్వరిని అభినందించారు.ఈ సందర్భంగా మహేశ్వరిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో కష్టపడి చదివి మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. అలాగే వైద్య విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం తనవంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు.విద్యాభ్యాసంలో భవిష్యత్‌లో ఎలాంటి సహాయం అవసరమైనా తనను సంప్రదించాలని, తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని బీఎస్ఆర్ భరోసా ఇచ్చారు. మహేశ్వరి మెడికల్ సీటు సాధించడం పట్ల మారేపల్లి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.రిపోర్టర్ ముకుంద్ రెడ్డి.