BREAKING
తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం శివకార్తికేయన్‌తో విభేదాలపై స్పందించిన వెంకట్ ప్రభు.. ఆ వార్తలపై క్లారిటీ prabhas-releases-romeo-juliet-movie-story-glimpse ఏఐ-ఆధారిత ఫార్మకోవిజిలెన్స్ పై శిక్షణ ఐఐటీ హైదరాబాదు నిపుణులతో గీతం ఫార్మసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం కావాలి. షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. ఏ ఐ సి టి యు డిమాండ్. చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ఓ అందాల రాక్షసీ హీరో షిరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.. రూ.70 కోట్లతో పాఠశాలల ఆధునీకరణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రమాదకర స్టంట్లతో యువకుడు అల్ చల్.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు

రాబిస్ నివారణకు సమిష్టి కృషి అవసరం

Select Suryaa Now
రాబిస్ నివారణకు సమిష్టి కృషి అవసరం

 

*రేబిస్‌ నివారణకు సమష్టి కృషి అవసరం*

– ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎం.ఎస్. రాజు

రేబిస్‌ నివారణకు వైద్యులు, ప్రజలు, మున్సిపల్‌ సంస్థలు, జంతు ప్రేమికులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎం.ఎస్. రాజు అన్నారు. సోమవారం ప్రపంచ రేబిస్‌ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో రెబిస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ రేబిస్‌ చికిత్స, నివారణ, వ్యాక్సినేషన్‌ అంశాలపై వైద్య, పారామెడికల్‌ విద్యార్థులు మరింత పరిశోధనలు చేసి ప్రజలకు ఉపయోగపడే ఆధునిక విధానాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. రేబిస్‌ మరణాలపై సమర్థవంతమైన నిఘా, కచ్చితమైన నివేదికల వ్యవస్థ అవసరమన్నారు. రేబిస్‌ వ్యాక్సిన్‌ సమర్థతను కాపాడేందుకు తయారీదారు నుంచి లబ్ధిదారునికి చేరే వరకు నిర్దేశిత ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం అత్యంత కీలకమని వివరించారు.రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెటర్నరీ డాక్టర్‌, యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌ అండ్‌ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ ప్రాజెక్ట్‌ అధికారి డా. బి. అరుణాదేవి మాట్లాడుతూ రేబిస్‌ అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ, కుక్కకాటు జరిగిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటే నివారించవచ్చన్నారు. కుక్కకాటు జరిగిన వెంటనే గాయాన్ని 10–15 నిమిషాల పాటు సబ్బు మరియు ప్రవహించే నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. కుక్కలకు ఉచిత రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మరింత సమాచారం కోసం 7093921991 నంబరును సంప్రదించవచ్చన్నారు. రేబిస్‌తో బాధపడుతున్న జంతువుల్లో కనిపించే లక్షణాలను కూడా ఆమె వివరించారు.పెడియాట్రిక్స్‌ విభాగం హెచ్‌ఓడీ డా. మోహన్‌ చంద్రన్‌ మాట్లాడుతూ చిన్నారుల్లో కుక్కకాటు ఘటనలు అధికంగా నమోదవుతున్నందున తల్లిదండ్రులు, పిల్లల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం హెచ్‌ఓడీ డా. రమేష్‌ బాబు మాట్లాడుతూ గత ఆరు నెలల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సుమారు 3,000 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిపారు.కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం హెచ్‌ఓడీ డా. వి. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ పెంపుడు, సెమీ-పెంపుడు, వీధి కుక్కలన్నింటికీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ చేయించడం అవసరమన్నారు. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని, దీనికి మున్సిపల్‌ సంస్థలు, ప్రజలు, జంతు ప్రేమికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమన్వయాధికారి డా. బి. శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ రేబిస్‌ నివారణలో ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమన్నారు. జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్‌ వ్యాక్సినేషన్‌ చేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డా. భారతి, డా. ప్రవీణ్‌, డా. సురేంద్ర, డా. దీప్తి, డా. ఆశాజ్యోతి, డా. ప్రశాంత్‌, డా. ఉదయ్‌ కుమార్‌, డా. విష్ణు, డా. అపర్ణ, డా. చాందిని తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు, పారామెడికల్‌ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్స్‌ పాల్గొన్నారు.