ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్రజావాణి ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి 62 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.