BREAKING
పొదిలి ప్రెస్ క్లబ్ కు ఎమ్మెల్యే వరాల జల్లు కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి ఓటీటీకి సందీప్ రెడ్డి వంగా చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రోమాంచకం బిగ్‌బాస్ హౌస్‌లో మిథిలేష్ సంచలనం..ఆదివారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి

*భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి

Select Suryaa Now
*భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి

- విద్యార్థి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం: ఎస్‌ఎఫ్‌ఐ

ఎస్‌ఎఫ్‌ఐ షాద్‌నగర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ షాద్‌నగర్‌ డివిజన్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ ఆశయాలను నేటి విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భగత్‌సింగ్‌ కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు మాత్రమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచన, దోపిడీ లేని సమాజం కోసం కలలు కన్న గొప్ప విప్లవకారుడని పేర్కొన్నారు. నేటి విద్యార్థులు భగత్‌సింగ్‌ జీవిత చరిత్రను చదవడంతో పాటు ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, సామాజిక సమానత్వం కోసం విద్యార్థులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. భగత్‌సింగ్‌ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం విద్యార్థి ఉద్యమాలు నిరంతరం కృషి చేయాలని, ఆయన త్యాగాలు, ఆశయాలను రాబోయే తరాలకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షుడు ఆదిల్‌, నాయకులు రామ్‌చరణ్‌, శివ, మనోజ్‌, రాహుల్‌, విష్ణు, చరణ్‌, జస్వంత్‌, మహేందర్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- M నరసింహారెడ్డి : మేజర్ న్యూస్, ఫరూక్ నగర్.