BREAKING
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి ఓటీటీకి సందీప్ రెడ్డి వంగా చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రోమాంచకం బిగ్‌బాస్ హౌస్‌లో మిథిలేష్ సంచలనం..ఆదివారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి

SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా

Select Suryaa Now
SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా

SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

SIR పేరుతో ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ SIR ప్రక్రియ పేరుతో తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తినా, కమిషన్ వైఖరిలో మార్పు కనిపించలేదన్నారు. SIR ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించడంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.