దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి
ఆళ్లగడ్డ తాలూకాలో దళితులకు స్మశాన వాటిక స్థలాలు కేటాయించాలి
పోటో. వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్ : ఆళ్లగడ్డ తాలూకాలో దళితులకు స్మశాన వాటిక స్థలాలు లేవని కేటాయించాలని ముఖ్యంగా ముఖ్యంగా ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లి గ్రామంలో స్మశానానికి స్థలం కేటాయించి దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల దాసు బిక్షం ను కలిసి మిస్టర్. హ్యూమన్ రైట్స్ కమిటీ నంద్యాల జిల్లా చైర్మన్ డాలు రత్నమయ్య వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ తాలూకాలో దళితులకు స్మశాన వాటిక స్థలాలు కేటాయించాలని మరియు అంబేద్కర్ భవనమునకు స్థలం కేటాయించి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆయన్ను కోరారు. ఆళ్లగడ్డ తాలూకాలో 50వేల ఓట్లు ఉన్న దళితులకు స్థలం కేటాయించి అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది, లీగల్ సెల్ సభ్యులు స్వామినాథం, సురేష్, న్యాయవాది రమేష్ తదితరులు పాల్గొన్నారు.