BREAKING
1500 నాటు కోళ్లు మృత్యువాత బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌ పాలనలో ద్రోహం పొదిలి ప్రెస్ క్లబ్ కు ఎమ్మెల్యే వరాల జల్లు కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి ఓటీటీకి సందీప్ రెడ్డి వంగా చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రోమాంచకం బిగ్‌బాస్ హౌస్‌లో మిథిలేష్ సంచలనం..ఆదివారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి

దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి

Select Suryaa Now
దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి

నంద్యాల అర్బన్ :
నంద్యాల పట్టణంలో గత నెల 8వ తేదీన ఆత్మకూర్ బస్టాండ్ సమీపంలోని త్రివేణి బార్‌లో జరిగిన గొడవకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు వెల్లడించారు. ​అరెస్ట్ అయిన వారిని ఇమ్రాన్ మరియు ఈశ్వర్‌లుగా గుర్తించారు.  నిందితులు ఇద్దరూ సల్మాన్ రాజు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఈ రోజు వారిని అరెస్ట్ చేశారు.​ విచారణలో ఇమ్రాన్‌పై నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు తేలిందని పోలీస్ అధికారి తెలిపారు.  

​*పోలీసుల హెచ్చరిక* 
సమాజంలో రౌడీషీటర్లు మరియు ఇతర నేరస్థులు చట్టానికి కట్టుబడి, మర్యాదగా జీవించాలని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నాన్-బెయిలబుల్ (Non-Bailable) కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.