BREAKING
పొదిలి ప్రెస్ క్లబ్ కు ఎమ్మెల్యే వరాల జల్లు కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి ఓటీటీకి సందీప్ రెడ్డి వంగా చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రోమాంచకం బిగ్‌బాస్ హౌస్‌లో మిథిలేష్ సంచలనం..ఆదివారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి

గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

Select Suryaa Now
గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మంథనిలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం మంథనిలో పర్యటించిన ఆయన పుష్కర ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, భూసేకరణ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, రైతులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల అవసరాలకు సంబంధించిన భూమిని త్వరితగతిన సేకరించి, పెండింగ్‌ అంశాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, నిబంధనల మేరకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పుష్కర ఘాట్ల వద్ద తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, రహదారులు, పార్కింగ్‌, భద్రత తదితర మౌలిక వసతులను ముందస్తుగా ఏర్పాటు చేయాలని తెలిపారు. గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను సైతం త్వరగా ప్రారంభించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

మల్లెపల్లి బాలుర డిగ్రీ కళాశాలలో వసతులు

మల్లెపల్లి బాలుర డిగ్రీ కళాశాలను స్థానిక బాలుర పాఠశాల ఆవరణలోకి మార్చిన నేపథ్యంలో విద్యార్థులకు తరగతి గదులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.ఈ పర్యటనలో ఆర్డీవో సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ ఆరిఫోద్దీన్‌, వివిధ శాఖల అధికారులు, ఎండోమెంట్‌, ఇరిగేషన్‌ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.