BREAKING
*భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం

మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది

Select Suryaa Now
మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది

మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): మేడ్చల్ మేజర్ పరిధిలో విద్యుత్ పనుల్లో భద్రతా ప్రమాణాలు గాలికి కొట్టుకుపోతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ చెక్‌పోస్ట్ పరిధిలోని లక్ష్మీనారాయణ బుక్ కంపెనీ వద్ద ఎలాంటి భద్రతా పరికరాలు ఉపయోగించకుండా ఓ ప్రైవేట్ సిబ్బంది నేరుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫ్యూజ్ మారుస్తున్న దృశ్యం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసి, తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ఇలాంటి పనులు చేయాల్సి ఉండగా, ఎలాంటి లైన్ క్లియర్ అనుమతులు తీసుకోకుండానే పనులు చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లు లేదా విద్యుత్ స్తంభాలపై పనులు చేసే సమయంలో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేత ధ్రువీకరణతో పాటు చేతికి గ్లౌజులు, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలి. అయితే ఈ ఘటనలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా సిబ్బంది నేరుగా ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బ స్టోరేజ్ వద్ద గతంలో ఇదే తరహాలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నాగరాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటూ, ఇప్పటికీ శాఖలో మార్పు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయించడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని చుట్టుపక్కల వ్యాపారులు, నివాసితులు భయాందోళన చెందుతున్నారు. అసలు ఈ పనులకు సంబంధించిన విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణ ఎక్కడ ఉందనే ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం కరవయ్యింది. తక్షణమే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మేడ్చల్ చెక్‌పోస్ట్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రిపోర్టర్ తలారి శివకుమార్.