రామాపురానికి సీఎం చంద్రబాబు.
29న నెల్లూరు జిల్లాలో పర్యటన
వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ-3.0కు శ్రీకారం కాకొల్లువారిపల్లిలో నూతన బీటీ రోడ్డు పరిశీలన
సూర్య, స్టేట్ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం 29న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరికుంటపాడు మండలంలోని రామాపురం గ్రామంలో నిర్వహించే పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.05 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి, 10.20 గంటలకు విజయవాడ స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికకు చేరుకుంటారు. ఉదయం 10.20 నుంచి 11.45 గంటల వరకు నిర్వహించే మిషన్ కర్మయోగి రీజినల్ వర్క్‌షాప్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.15 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు వరికుంటపాడు మండలలోని రామాపురం గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.అనంతరం మధ్యాహ్నం 2.35 గంటలకు వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి గ్రామానికి చేరుకుని, 2.35 నుంచి 3 గంటల వరకు కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తారు. అనంతరం రామాపురంలో జరిగే పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.